తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరప్‌లోని 16 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. ఈ క్రమంలో కార్యక్రమ పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ , ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ వేమూరి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచిరాం ప్రసాద్, ఎన్ఆర్ఐలు కాట్రగడ్డ కృష్ణప్రసాద్, శ్రీకాంత్ కుడితిపూడి, సుమంత్ కొర్రపాటి, తిట్టు మద్దిపట్ల, కృష్ణ జావాజి, సూర్య వెలగ, నరేష్ కోనేరు తదితరులు పాల్గొన్నారు.
శెంగెన్ ప్రాంత సమన్వయకర్తలుగా నరేష్ కోనేరు, శ్రీకాంత్ కుడితిపూడి, సుమంత్ కొర్రపాటి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడారు. యూరప్‌లో నివసించే తెలుగు ప్రజలకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేందుకు, సంప్రదాయ సాంస్కృతిక విలువలను చేరవేసేందుకు ఈ కల్యాణాలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. పంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ మహోత్సవాల్లో పాల్గొని శ్రీనివాసుడి అనుగ్రహం పొందాలని కోరారు. యూరప్ మొత్తం కార్యక్రమాలకుగానూ డాక్టర్ చలసాని కిషోర్ బాబు ప్రధాన సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు. యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్ ప్రాంతాల సమన్వయకర్తలుగా కాట్రగడ్డ కృష్ణప్రసాద్, విజయ్‌కుమార్ అడుసుమిల్లి, సురేష్ కోరం, శ్రీను వావిలాల, గోగినేని శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు.


