అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారు విగ్రహాన్ని అమెరికా క్యాపిటల్ భవనం ఎదురుగా ఏర్పాటు చేశారు. 12 అడుగులు ఉన్న ఈ విగ్రహం ట్రంప్ బిట్‌కాయిన్‌ను పట్టుకుని ఉన్నట్లు రూపొందించారు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులు ఈ విగ్రహం ఏర్పాటుకు నిధులు సమకూర్చినట్లు నిర్వాహకులు తెలిపారు. డిజిటల్ కరెన్సీ భవిష్యత్తు, ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్‌లో ఫెడరల్ ప్రభుత్వ విధానాల గురించి చర్చించుకునేలా చేసేందుకే దీన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్పినట్లు సమాచారం.


