కూటమి ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు చైర్మన్లను నియమించింది. అలాగే, టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్లను నియమించింది. వివిధ ఆలయాల బోర్డులకు చైర్మన్లను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం – పోతుగుంట రమేశ్ నాయుడు. శ్రీకాళహస్తి కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం – కొట్టె సాయి ప్రసాద్.కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం – వి. సురేంద్ర బాబు (మణి నాయుడు). విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం (ఇంద్రకీలాద్రి) – బొర్రా రాధాకృష్ణ (గాంధీ). వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం – ముదునూరి వెంకట్రాజు.
టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్ల నియామకం …
టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ – ఏవీ రెడ్డి. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, హిమాయత్‌నగర్, హైదరాబాద్ – నేమూరి శంకర్ గౌడ్. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, బెంగళూరు – వీరాంజనేయులు. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ఢిల్లీ – ఎదుగుండ్ల సుమంత్ రెడ్డి. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ముంబై – గౌతమ్ సింగానియా. .టీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, విశాఖపట్నం – వెంకట పట్టాభిరామ్ చోడే నియమించింది.


