బంగారం, వెండి ధరలు రోజు రోజుకీ పరుగులు పెడుతూనే ఉ న్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.2700 పెరిగి రూ. 1,18,900కు చేరుకుంది. సురక్షితమైన ఆస్తిగా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడం, అమెరికా హెచ్1బి వీసా పెంపు నేపథ్యంలో రూపాయి విలువ భారీగా పడిపోవ డం వంటివి బంగారం ధర పెరుగుదలకు కారణవుతున్నాయి. ఆల్ ఇండి యా సరఫ అసోసియేషన్ ప్రకార.. క్రితం రోజు 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర రూ.1,16,200 (10 గ్రాములు) వద్ద ముగిసింది. స్థానిక బులియన్ మార్కెట్లో 99.5 శాతం స్వచ్ఛత పసిడి రికార్డు స్థాయిలో రూ. 1,18,300 (10 గ్రాములు)కు చేరింది.


