పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజీ. సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదలై, మొదటి రోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లు, పాటలతో భారీ హైప్ క్రియేట్ చేయగా, రిలీజ్ రోజున అభిమానుల నుంచి అద్భుత స్పందన అందుకుంది. ఓజీ వరల్డ్ వైడ్‌గా తొలిరోజే దాదాపు రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇందులో ఇండియా వైడ్ షోస్ ద్వారా రూ.65 కోట్లు, ఓవర్సీస్ ప్రీమియర్స్ ద్వారా రూ.27 కోట్లు (3.65 మిలియన్ డాలర్లు) రాబట్టినట్లు సమాచారం. ఆంధ్ర ప్రదేశ్ రూ.30.80 కోట్లు, తెలంగాణ రూ.26 కోట్లు, కర్ణాటక రూ.6.37 కోట్లు, తమిళనాడు రూ.1.20 కోట్లు, ఓవర్సీస్ (ప్రధానంగా నార్త్ అమెరికా): రూ.24.85 కోట్లు, ఇతర దేశాలు: రూ.7.55 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓజీ దుమ్ము లేపింది. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమా ఓపెనింగ్స్ అంచనాలను మించి ఉండడం విశేషం. నైజాం రూ. 20.7 కోట్లు గ్రాస్ , ఉత్తరాంధ్ర రూ.6.70 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.5.30 కోట్లు, గుంటూరు రూ.6.35 కోట్లు, పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రూ.20.25 కోట్లు షేర్, నెట్ కలెక్షన్లు దాదాపు రూ. 70 కోట్ల వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది.భారతీయ సినిమా చరిత్రంలో ఓపెనింగ్ రోజు ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలలో ఓజీ కూడా ఒకటిగా నిలిచింది.


