My Telugu NRI

Mobile Scrollable Menu
- Andhra - Latest News

ప్రపంచంలోనే భారతీయులు శక్తిమంతంగా మారారు: చంద్రబాబు

బీఎస్‌ఎన్‌ఎల్‌ శక్తిమంతమైన వ్యవస్థగా మారిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఒక్కసారి టెక్నాలజీ మారిందంటే ఎవరూ ఆపలేరని అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ స్వదేశీ 4జి సేవలు ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు  మాట్లాడుతూ  ప్రతి పదేళ్లకు ఒకసారి నూతన ఆవిష్కరణలు తోడవుతాయని, బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు మరింత విస్తృతమయ్యాయని తెలియజేశారు. ప్రైవేటు కంపెనీలకు పోటీ ఇచ్చేలా మెరుగైన సేవలందించారని పేర్కొన్నారు. జాబ్ వర్క్ చేస్తున్నామని కొత్త ఆలోచనలు రావాలని, 2010 లో 4 జి, 2020 లో 5జి, 2023 […]

బీఎస్‌ఎన్‌ఎల్‌ శక్తిమంతమైన వ్యవస్థగా మారిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఒక్కసారి టెక్నాలజీ మారిందంటే ఎవరూ ఆపలేరని అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ స్వదేశీ 4జి సేవలు ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు  మాట్లాడుతూ  ప్రతి పదేళ్లకు ఒకసారి నూతన ఆవిష్కరణలు తోడవుతాయని, బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు మరింత విస్తృతమయ్యాయని తెలియజేశారు. ప్రైవేటు కంపెనీలకు పోటీ ఇచ్చేలా మెరుగైన సేవలందించారని పేర్కొన్నారు. జాబ్ వర్క్ చేస్తున్నామని కొత్త ఆలోచనలు రావాలని, 2010 లో 4 జి, 2020 లో 5జి, 2023 లో 6జి సేవలు వస్తాయని చెప్పారు. నరేంద్ర మోడీ దూదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయని, కోవిడ్ సమయంలో వంద దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ అని ప్రశంసించారు.

ప్రపంచంలోనే భారతీయులు శక్తిమంతంగా మారారని, ప్రధాని సూచిస్తే డిజిటల్ కరెన్సీపై రిపోర్టు ఇచ్చామని అన్నారు. మనం తయారు చేసిన వస్తువులను విదేశాలు వాడే పరిస్థితి తీసుకొచ్చామని, అద్భుత ఆవిష్కరణలు విరివిగా వస్తున్నాయని, ఎవరూ ఆపలేరని అన్నారు. దేశంలో ప్రధాని క్వాంటమ్ మిషన్ తీసుకొచ్చారని, మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతికి జనవరిలో వస్తుందని, సేఫ్టీ, సెక్యూటరీ కావాలంటే క్వాంటమ్ కంప్యూటర్ అవసరమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ సెక్యూరిటి చాలా అవసరమని, దేశంలో గ్రీన్ హైడ్రోజన్ తీసుకొస్తుంటే,  గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ తీసుకొస్తున్నామని రియల్ టైమ్ డేటా కోసం ఐవోటీలు వస్తున్నాయని, రియల్ టైమ్ లో మానిటర్ చేసే పరిస్థితికి వస్తున్నాం అని 2010 లో 4జి, 2020లో 5జి, 2030లో 6జి సేవలు వస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.