తెలుగు సినిమా ఇండస్ట్రీకు గట్టి ఎదురుదెబ్బ తగలబోతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల, ఇండియన్ మూవీలకు, ముఖ్యంగా తెలుగు సినిమాలకు అమెరికా మార్కెట్లో పెద్ద నష్టం వచ్చే అవకాశముంది. డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన నిర్ణయం ప్రకారం, అమెరికాలో విడుదలయ్యే విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్ (పన్ను) వసూలు చేయాలని నిర్ణయించారు. అంటే, భారతదేశంలో నిర్మించిన సినిమాలను అమెరికాలో విడుదల చేయాలంటే డబుల్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం అమెరికాలో తెలుగు సినిమాలకు భారీ ఆదరణ ఉంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చే కలెక్షన్లలో 75-80 శాతం వరకు నార్త్ అమెరికా నుంచే వస్తుంది.


