టాలీవుడ్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో అగ్రకథానాయకుడు చిరంజీవి హీరోగా రాబోతున్న చిత్రం మన శంకర వరప్రసాద్‌గారు. నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే కేరళ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దసరా పండుగ కానుకగా, మూవీ నుంచి క్రేజీ అప్డేట్ను పంచుకుంది. ఈ సినిమా నుంచి నయనతార పాత్రను పరిచయం మేకర్స్. ఈ సినిమాలో నయన్ శశిరేఖ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో నయన్ పసుపు రంగు చీరలో మెరిసిపోతుంది. ఇక కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తుండగా, షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


