జపాన్ దేశానికి తొలిసారి ఓ మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ సనాయి తకాయిచిని కొత్త నేతగా ఎన్నుకున్నారు. దీంతో జపాన్ ప్రధానిగా మహిళ ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. గత కొన్నాళ్లుగా కన్జర్వేటివ్ పార్టీలో లుకలుకలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రధాని షిగేరు ఇషిబా త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు గత నెలలో ప్రకటించారు. కన్జర్వేటివ్ నేత తకాయిచికి, బ్రిటన్ మాజీ తొలి మహిళా ప్రధాని మార్గరేట్ థాచర్‌ను ప్రేరణగా పొందారు. ఐరన్ లేడీ అన్న ఆశయాన్ని పూర్తి చేసేందుకు సమయం ఆసన్నమైనట్లు భావిస్తున్నారు. సేమ్ సెక్స్ మ్యారేజీలను తకాయిచి వ్యతిరేకించారు. మాజీ ప్రధాని షింజో అబే బాటలో ఆమె నడవాలనుకుంటున్నారు. అబే ఆర్థిక విజన్‌కు మళ్లీ జీవం పోయాలని ఆమె ఆశిస్తున్నారు. జపాన్ రాజ్యాంగాన్ని రివైజ్ చేయాలని కూడా ఆమె భావిస్తున్నారు.


