సోషల్ మీడియా యూజర్లకు మెటా కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వివిధ దేశాలకు చెందిన రీల్స్ వస్తుంటాయి. దాంతో భాష అర్థం కాక ఇబ్బందిపడుతుంటారు. తాజాగా ఈ సమస్యకు మెటా కంపెనీ చెక్ పెట్టింది. హిందీ, పోర్చుగీస్ భాషలకు కూడా ఏఐ ఆధారిత వీడియో టాన్స్‌లేట్ ఫీచర్‌ను రిలీజ్ చేసింది. దాంటే కంటెంట్ క్రియేటర్లు తమ సొంత వాయిస్‌ను ఉపయోగించి ఇతర భాషల్లోనూ తమ వీడియోలను ఆటోమేటిక్‌గా డబ్ చేయగలిగే అవకాశం ఉంటుంది. రీల్ వ్యూయర్స్ వారికి కావాల్సిన లాంగ్వేజ్‌లో రీల్స్‌ను చూడగలిగే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ను మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఓ వీడియో ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం రీల్స్ ట్రాన్స్‌లేట్ హిందీ, పోర్చుగీస్, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో అందుబాటులో ఉందని.. భవిష్యత్‌లో మరిన్ని భాషలో జోడించనున్నట్లు పేర్కొన్నారు.


