అమెరికాకు అన్ని రకాల తపాలా సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి ఆ సేవలను పునఃప్రారంభించినట్లు భారతీయ తపాలా శాఖ ప్రకటించింది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆగస్టు 25 నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే, రెండు నెలల తర్వాత అమెరికాకు బుధవారం నుంచి అన్ని రకాల పోస్టల్ సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు భారతీయ తపాలా శాఖ తాజాగా ప్రకటించింది.అంతర్జాతీయ వాణిజ్య సరకుల బట్వాడాదారులపై(కొరియర్లపై) అదనపు సుంకాలపై అమెరికా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆగస్ట్ 25 నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇది భారత తపాల శాఖ ద్వారా వెళ్ళే కొరియర్లకు వర్తించనప్పటికీ, మార్పులు చేయడం కోసం ఇండియన్ తపాలా శాఖ ఆగస్టులో సర్వీసులను ఆపేసింది. ఇప్పుడు రెండు నెలల తర్వాత వీటిని తిరిగి పునరుద్ధరించింది.


