ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని కొత్త 4జీ యూజర్లకు నెలరోజులపాటు ఉచితంగా సర్వీసులు అందించనున్నట్టు ప్రకటించింది. ఇందు కోసం రూపాయి చార్జీని విధించనున్నది. వచ్చే నెల 15 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తించనున్నదని ఒక ప్రకటనలో వెల్లడించింది. నూతన కస్టమర్లకు 30 రోజులపాటు అన్లిమిటెడ్ వాయిస్‌కాల్స్, రోజు 2జీబీ డాటా, 100 ఎస్ఎంఎస్లు, సిమ్‌ను ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. నూతన కస్టమర్లకు 4జీ అనుభవం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నూతన ఆఫర్‌ను తెరపైకి తీసుకొచ్చినట్టు బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఏ రాబర్ట్ జే రవి తెలిపారు.


