దీపావళి అమ్మకాలు ఈ ఏడాది దేశవ్యాప్తంగా రూ.6.05లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో రూ.5.40 కోట్ల విలువైన వస్తువ వ్యాపారం, రూ.65వేల కోట్ల విలువైన సర్వీసెస్ వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) నివేదికను విడుదల చేసింది. ఇదే ఇప్పటి వరకు దేశ వాణిజ్య చరిత్రలో అతిపెద్ద పండుగగా నిలిచింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానులతో పాటు టైర్-2, టైర్-3 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 60 ప్రధాన కేంద్రాల్లో సీఏఐటీ రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్‌మెంట్ సొసైటీ నిర్వహించిన సర్వే ఆధారంగా డిటైర్డ్ దీపావళి పండుగ అమ్మకాలు 2025 పేరుతో నివేదికను విడుదల చేసింది. సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు, స్వదేశీ స్వీకరణకు బలమైన బ్రాండ్ అంబాసిడర్‌గా ఎదిగారని నివేదిక చూపిస్తుందని పేర్కొంది.
ఇది వ్యాపారులు, వినియోగదారులు ఇద్దరిని అపూర్వమైన రీతిలో ప్రేరేపించిందని అన్నారు. 87శాతం మంది వినియోగదారులు విదేశీ వస్తువుల కంటే భారతీయ వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇష్టపడ్డారని, తత్ఫలితంగా చైనా ఉత్పత్తులకు డిమాండ్ భారీగా తగ్గిందని పేర్కొన్నారు.


