మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం భారీగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సత్తా చాటడంతో ఆయన వేతనం భారీగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరానికి సత్యనాదెళ్ల జీతం 22 శాతం పెరిగి 96.5 మిలియన్ల డాలర్లకు చేరుకుంది. భారత కరెన్సీ ప్రకారం రూ.847.31 కోట్లు అన్నమాట. బాధ్యతలు చేపట్టిన గత పదేళ్లలో ఇదే అత్యధిక వేతనం. కృత్రిమ మేధస్సులో కంపెనీ పురోగతికిగాను నాదెళ్లకు ఈ ప్రోత్సాహం అందనుంది. గతేడాది ఆయన జీతం 79.1 మిలియన్ డాలర్లుగా ఉండేది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన 79.1 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్నారు. భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.664 కోట్లు.


