దీపావళి పండుగ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. అందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌కాల్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలిపినందు కు ధన్యవాదాలు. వెలుగుల పండుగ నాడు, ఈ రెండు ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచంలో ఆశల వెలుగులు నింపుతూ ముందుకు సాగాలి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


