త్వరలో 14వేల అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల నియామకాన్ని చేపట్టబోతున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ వన్ సూపర్‌వైజర్లుగా నియమితులైన అభ్యర్థులకు నియామక పత్రాలని మంత్రి సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా గ్రేడ్ వన్ సూపర్‌వైజర్లుగా నియమితులైన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమాన్ని తమ ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకుందని వ్యాఖ్యానించారు. ఎన్నో సవాళ్లు ఉన్నా ఆకాశాన్ని చీల్చుకొని అంతరిక్షం వరకు మహిళలు చేరుకుంటున్నారని ఉద్ఘాటించారు. ఐసీడీఎస్ సేవలకు భారతదేశంలో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రాణం పోశారని నొక్కిచెప్పారు.


