మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల త్వరలో భారత్‌లో ప్రకటించనున్నారు. డిసెంబర్లో ఢిల్లీ, ముంబయితో పాటు బెంగళూరు నగరాలను ఆయన ఈ పర్యటనలో సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు, మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఉద్యోగులను కలుస్తారని పలు నివేదికలు తెలిపాయి. సత్య నాదెళ్ల తన పర్యటనలో అనేక కీలకమైన ఏఐ సంబంధిత సమావేశాల్లో ప్రసంగిస్తారని పేర్కొంది. కంపెనీ అధికారికంగా ఆయన పర్యటనను ధ్రువీకరించనప్పటికీ.. ఈ పర్యటన మైక్రోసాఫ్ట్‌కు వ్యూహాత్మకంగా కీలకమైందిగా భావిస్తున్నారు.
భారత్-అమెరికా సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ఇటీవల రెండు దేశాలు విభేదాలను పక్కనపెట్టి సాంకేతిక భాగస్వామ్యంపై దృష్టి సారిస్తున్నాయి. మరో వైపు భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా యాప్‌లు, సేవలను ప్రోత్సహిస్తున్నది. జోహో కార్పొరేషన్ వంటి భారతీయ కంపెనీలు మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలకు ప్రత్యామ్నాయంగా నిలువబోతున్నాయి.


