అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరకాటంలో పడ్డారు. హిందూ మతానికి చెందిన తన భార్య ఉషా వాన్స్, క్రైస్తవ మతాన్ని స్వీకరించాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల జేడీ వాన్స్‌పై విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ మెసిసిప్పిలో జరిగిన టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ మీటింగ్‌లో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన భార్య ఉషా తనతో చర్చికు హాజరవుతోందని, కానీ ఆమె ఏదో ఒక రోజు పూర్తిగా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
క్రైస్తవ సువార్తల పట్ల ఆమె ఆకర్షితురాలుకావాలని జేడీ వాన్స్ భావించారు. నేను క్రైస్తవాన్ని నమ్ముతానని, నా భార్య కూడా క్రైస్తవాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ మత విశ్వాసాలు వేరైనా తమ మధ్య ఎటువంటి విబేధాలు లేవన్నారు. ఒకవేళ ఆమె మారకపోతే, అప్పుడే ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంటుందని భగవంతుడే చెబుతాడని జేడీ వాన్స్ అన్నారు. ఇదేమీ తనకు సమస్య కాదన్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఈ అంశంలో ఏకాభిప్రాయం అవసరమన్నారు. ప్రేమించే వ్యక్తిని కూడా పరిగణలోకి తీసుకుకోవాల్సి వస్తుందన్నారు.


