బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్. బ్యాంకు నిబంధనల్లో కీలక మార్పులు జరుగబోతున్నాయి. మారిన నిబంధనలు నేటి (నవంబర్ ఒకటి) నుంచి అమలులోకి వచ్చాయి. అమలులోకి రానున్నాయి. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంక్ అకౌంట్ల నామినీల విషయంలో కీలక మార్పులు చేసింది. ఇకపై నుంచి నలుగురు నామినీలను ఎంపిక చేసుకునే వీలు కల్పించింది. దాంతో బ్యాంకింగ్ సిస్టమ్‌లో క్లెయిమ్ సెటిల్‌మెంట్ మరింత సులభతరం కానున్నది. ఇందు కోసం కేంద్రం బ్యాంకింగ్ చట్టాలు (సవరణ) యాక్ట్‌లో మార్పులు చేసింది.
బ్యాంకు నామినీలను నలుగురిని ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉండడంతో ఖాతాదారులకు ఉపయోగకరంగా ఉండనున్నది. వాస్తవానికి గతంలో ఈ పరిమితి ఇద్దరికి మాత్రమే అవకాశం ఉండేది. తాజాగా నలుగురు నామినీలు కలిగి ఉండడంతో వ్యక్తులు వారి నిధులు, ఆస్తులపై ఎక్కువ నియంత్రణను కలిగి ఉండనున్నారు. ఈ చర్య క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభంగా, క్రమబద్ధీకరించడానికి కేంద్రం ఈ మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు.. నామినీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా రికార్డు చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఖాతాదారుల నిధులను రక్షించేందుకు, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో త్వరిత క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను నిర్ధారించేందుకు ఈ మార్పును అమలులోకి తీసుకువస్తున్నది. ఇది బ్యాంక్ వ్యవస్థలో జవాబుదారీతనం పెంచుతుంది. స్పష్టమైన సమాచార నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది.


