బిహార్‌లో తాము ఇప్పటివరకూ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోలేదని వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ ఎన్నికల తరువాత కూడా ఎలాంటి పొత్తులూ ఉండవని తేల్చి చెప్పారు. ప్రస్తుత పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు తమను గుర్తిస్తున్నారని అన్నారు. అయితే, రాజకీయ పార్టీల తీరుతెన్నుల కారణంగా నిరాశలో ఉన్న ప్రజలు తమపై విశ్వాసంతో ముందడుగు వేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో తాము 150 సీట్లకు పైగా గెలవొచ్చని లేకపోతే 10 సీట్ల లోపునకు పరిమితం కావొచ్చని అంచనా వేశారు.
ఇలాంటి రాజకీయాలు మేము చేయము. ప్రజలు మాకు స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోతే మేము ఎప్పటిలాగే ప్రజా సేవ చేస్తూ కొనసాగుతాము. కావాలంటే ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా చెబుతా, ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత మాకు ఎవరితోనూ పొత్తులు ఉండవు. స్పష్టమైన మెజారిటీ లేని సమయంలో పార్టీ నుంచి నేతలు మారే అవకాశం ఉంది. దీన్ని నేను అడ్డుకోలేను. డబ్బుపై ఆశ, సీబీఐ అంటే భయంతో ఇలాంటి పరిణామాలు జరుగుతాయి అని అన్నారు.


