My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International - NRI

అమెరికా నుంచి వ‌స్తున్న ఎయిర్ ఇండియా విమానం.. దారిమ‌ళ్లింపు

శాన్‌ఫ్రాన్సిస్‌కో నుంచి ఢిల్లీకి వ‌స్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని మంగోలియా రాజ‌ధాని ఉల‌న్‌బాట‌ర్‌కు దారి మ‌ళ్లించారు. ఆదివారం ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. విమానంలో గాలిలో ఎగురుతున్న స‌మ‌యంలో సాంకేతిక లోపం ఏర్పిన‌ట్లు తెలుస్తోంది. ఫ్ల‌యిట్ ఏఐ174 బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్ ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా ఉల‌న్‌బాట‌ర్‌లో సుర‌క్షితంగా దిగిన‌ట్లు ఎయిర్‌లైన్ సంస్థ పేర్కొన్న‌ది. ఆ విమానంలో ఉన్న ప్ర‌యాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్న‌ట్లు సంస్థ వెల్ల‌డించింది. శాన్ ఫ్రాన్సిస్‌కో నుంచి విమానానం 2.47 నిమిషాల‌కు బ‌య‌లుదేరింది. ఆ […]

శాన్‌ఫ్రాన్సిస్‌కో నుంచి ఢిల్లీకి వ‌స్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని మంగోలియా రాజ‌ధాని ఉల‌న్‌బాట‌ర్‌కు దారి మ‌ళ్లించారు. ఆదివారం ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. విమానంలో గాలిలో ఎగురుతున్న స‌మ‌యంలో సాంకేతిక లోపం ఏర్పిన‌ట్లు తెలుస్తోంది. ఫ్ల‌యిట్ ఏఐ174 బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్ ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా ఉల‌న్‌బాట‌ర్‌లో సుర‌క్షితంగా దిగిన‌ట్లు ఎయిర్‌లైన్ సంస్థ పేర్కొన్న‌ది. ఆ విమానంలో ఉన్న ప్ర‌యాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్న‌ట్లు సంస్థ వెల్ల‌డించింది. శాన్ ఫ్రాన్సిస్‌కో నుంచి విమానానం 2.47 నిమిషాల‌కు బ‌య‌లుదేరింది. ఆ విమానంలో సోమ‌వారం రాత్రి 9.59 నిమిషాల‌కు ల్యాండ్ కావాల్సి ఉన్న‌ది.  సాంకేతిక స‌మ‌స్య వ‌చ్చిన ఆ విమానాన్ని ప‌రిశీలించేందుకు ఇంజినీర్లు రంగంలోకి దిగిన‌ట్లు అధికారులు తెలిపారు. ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌ను చేసిన‌ట్లు చెప్పారు. స్టాండ‌ర్డ్ ప్రోటోకాల్ ప్ర‌కారం ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఉల‌న్‌బాట‌ర్ విమానాశ్ర‌యంలో ప్ర‌యాణికుల‌కు స‌హ‌కారం అందిస్తున్నామ‌ని, వారికి త‌గిన భోజ‌నం ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.