My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

భూటాన్‌లో ప్ర‌పంచ శాంతి ప్రార్థ‌న‌లు ప్రారంభం

భూటాన్‌లో ప్ర‌పంచ శాంతి ప్రార్థ‌న‌లు  ప్రారంభం అయ్యాయి. న‌వంబ‌ర్ 4వ తేదీ నుంచి 17వ తేదీ వ‌ర‌కు ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న బౌద్ధ నేత‌లు, బిక్షువులు, శాంతి దూత‌లు పెద్ద స్థాయిలో ఆధ్యాత్మిక స‌మ్మేళ‌నంలో పాల్గొంటున్నారు. భూటాన్ రాజ‌ధాని థింపూలో ఈ వేడుక‌లు జ‌రుగుతున్నాయి. బ‌జ‌గురు, కాల‌చ‌క్ర ప్రార్థ‌న‌లు నిర్వ‌హించ‌నున్నారు.బౌద్ధ‌మ‌తంలో ఉన్న భిన్న‌మైన సంప్ర‌దాయాల ఆధ్యాత్మిక గురువులు శాంతి ప్రార్థ‌న‌ల ద్వారా ఐక్య‌త చాటనున్నారు. భూటాన్ ప్ర‌భుత్వం ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ది. 13 రోజుల […]

భూటాన్‌లో ప్ర‌పంచ శాంతి ప్రార్థ‌న‌లు  ప్రారంభం అయ్యాయి. న‌వంబ‌ర్ 4వ తేదీ నుంచి 17వ తేదీ వ‌ర‌కు ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న బౌద్ధ నేత‌లు, బిక్షువులు, శాంతి దూత‌లు పెద్ద స్థాయిలో ఆధ్యాత్మిక స‌మ్మేళ‌నంలో పాల్గొంటున్నారు. భూటాన్ రాజ‌ధాని థింపూలో ఈ వేడుక‌లు జ‌రుగుతున్నాయి. బ‌జ‌గురు, కాల‌చ‌క్ర ప్రార్థ‌న‌లు నిర్వ‌హించ‌నున్నారు.బౌద్ధ‌మ‌తంలో ఉన్న భిన్న‌మైన సంప్ర‌దాయాల ఆధ్యాత్మిక గురువులు శాంతి ప్రార్థ‌న‌ల ద్వారా ఐక్య‌త చాటనున్నారు. భూటాన్ ప్ర‌భుత్వం ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ది. 13 రోజుల పాటు వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ప్ర‌ఖ్యాత లామాలు, స్కాల‌ర్స్‌, బౌద్ధ మ‌తంలోని తీరవాడ‌, మ‌హాయాణ‌, వ‌జ్రాయ‌న ప‌ద్ధ‌తుల‌ను పాటించేవారు ఈ ప్రార్థ‌న‌ల‌కు హాజ‌ర‌వుతున్నారు. శాంతియుత‌, సంతోష‌క‌ర‌మైన భ‌విష్య‌త్తు కోసం కావాల్సిన ప్రేమ‌, క‌రుణ గురించి అవ‌గాహ‌న క్రియేట్ చేయ‌నున్నారు. ప‌విత్ర‌మైన జాబ్జీ దోహిచోగ్ క్రియ‌తో గ్లోబ‌ల్ పీస్ ప్రేయ‌ర్ ఫెస్టివ‌ల్‌ను ప్రారంభించారు. చాలా అరుదైన ఈ పూజ‌ను అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించారు. శ‌రీరాన్ని, వాక్కును, నెగ‌టివ్ మైండ్‌ను శుద్ధి చేసే ఉద్దేశంతో ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. వివిధ బౌద్ధ సంప్ర‌దాయాల‌కు చెందిన గురువులు ఇంగ్లీష్‌, టిబెట్‌, దోంగ్కా భాష‌లు ప్రార్థ‌న‌లు చేప‌ట్ట‌నున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.