పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ కాన్వాయ్ అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద కాన్వాయ్ వాహనాలు ఒక దాని కొకటి ఢీకొన్నాయి. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ మేరకు రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనాలు నిలిచిపోయాయి. ఎంత మెుర పెట్టుకుంటున్నా వినకుండా, జగన్ కాన్వాయ్ ఇష్టం వచ్చినట్లు ముందుకు సాగిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతల అత్యుత్సాహం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు. పోలీసుల నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. డీజే ఏర్పాటు చేయగా. అనుమతి లేదని పోలీసులు దాన్ని తీయించారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నేతల తీరుతో హైవేపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైవేపై ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించవద్దని పార్టీ నేతలకు పోలీసులు సూచించారు.


