చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత భారత మహిళల క్రికెట్ జట్లు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ఐసీసీ ట్రోఫీని నెగ్గింది. 52 సంవత్సరాల మహిళా క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా ట్రోఫీని గెలుచుకున్నందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టును ప్రధాని మోదీ అభినందించారు.
వరుసగా మూడు పరాజయాలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న తర్వాత టోర్నీలో అద్భుతమైన పునరాగమనం చేసి టైటిల్‌ను సాధించడంపై ప్రధాని ప్రశంసించారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత మహిళా జట్టుకు హోటల్‌లో డ్రమ్స్, పూలతో ఘన స్వాగతం లభించింది. ప్లేయర్లు, కోచ్ అమోల్ మజుందార్ కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ప్రధానమంత్రి మోదీ జట్టును అభినందించారు. భారత క్రికెట్ ఈ చారిత్రాత్మక క్షణం కలల విజయంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రధానికి ‘నమో’ అని ఉన్న జెర్సీని అందజేశారు.


