న్యూయార్క్ నగర మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఈ సంబరాల్లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. దక్షిణాసియా మూలాలున్న మమ్దానీ గెలుపును అభిమానులు బాలీవుడ్ పాటతో క్రేజీగా సెలబ్రేట్ చేసుకున్నారు. మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం జోహ్రాన్ మమ్దానీ తన కుటుంబ సభ్యులతో కలిసి వేదికపైకి వచ్చారు. ఆయన విజయోత్సవ ప్రసంగాన్ని ముగించి వేదిక నుంచి దిగుతున్న సమయంలో నేపథ్యంలో బాలీవుడ్ మూవీ ధూమ్ సినిమా నుంచి ధూమ్ మచాలే పాటను ప్లే చేశారు నిర్వహాకులు. ఈ బాలీవుడ్ పాట మమ్దానీ చారిత్రక విజయాన్ని, దక్షిణాసియా మూలాలను ప్రతిబింబిస్తూ అక్కడి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపింది.


