My Telugu NRI

Mobile Scrollable Menu
- Business - Latest News

దాతృత్వంలో శివ్‌ నాడార్‌ నంబర్‌ 1

 దాతృత్వంలో  హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ కుటుంబం  ముందు వరుసలో ఉంటుంది. ఏటా కోట్లాది రూపాయలు దానం చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా దేశంలోనే అత్యంత దయాగుణం కలిగిన వ్యక్తిగా శివ్‌ నాడార్‌ నిలిచారు. ఎడెల్‌గివ్‌-హురున్‌ ఇండియా దాతలు 2025 జాబితా ప్రకారం 2025లో దాతృత్వ కార్యక్రమాలకు అత్యధిక మొత్తం అందించిన వారి జాబితాలో శివ్‌ నాడార్‌ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి 26 శాతం అధికంగా నాడార్‌ కుటుంబం రూ.2,708 […]

 దాతృత్వంలో  హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ కుటుంబం  ముందు వరుసలో ఉంటుంది. ఏటా కోట్లాది రూపాయలు దానం చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా దేశంలోనే అత్యంత దయాగుణం కలిగిన వ్యక్తిగా శివ్‌ నాడార్‌ నిలిచారు. ఎడెల్‌గివ్‌-హురున్‌ ఇండియా దాతలు 2025 జాబితా ప్రకారం 2025లో దాతృత్వ కార్యక్రమాలకు అత్యధిక మొత్తం అందించిన వారి జాబితాలో శివ్‌ నాడార్‌ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి 26 శాతం అధికంగా నాడార్‌ కుటుంబం రూ.2,708 కోట్లు దానం చేసింది. ఇక రిచ్‌ లిస్ట్‌లో తొలి స్థానంలో ఉండే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుటుంబం మాత్రం ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ద్వారా అంబానీ కుటుంబం రూ.626 కోట్లు దానం చేసింది. ఈ జాబితాలో బజాజ్ కుటుంబం రూ.446 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.