వన్డే వరల్డ్ కప్ కైవసంలో కీలక పాత్ర పోషించిన శ్రీచరణికి ఏపీ వాసులు ఘన స్వాగతం పలికారు. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి వరల్డ్ కప్ సాధించిన తరువాత మొట్టమొదటిసారిగా విజయవాడ కు వచ్చిన సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు అనిత, సవిత , పార్లమెంట్ సభ్యుడు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, శాప్ చైర్మన్ రవినాయుడు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆమె ఇండియా మాజీ కెప్టెన్ మిథాలిరాజ్తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. నివాసం వద్ద మంత్రి నారా లోకేష్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ గెలిచినందుకు శ్రీచరణిని అభినందించారు. ఈ సందర్భంగా శ్రీచరణికి ఏపీ సర్కార్ రూ. 2.5 కోట్ల నగదును, గ్రూప్ వన్ ఉద్యోగం, కడపలో భూమి ఇస్తామని ప్రకటించింది.


