చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ సంస్థ షాంఘై-ఢిల్లీ విమాన సర్వీసును ప్రారంభించింది. 95 శాతం ఆక్యుపెన్సీతో ఈ విమానం నడిపింది. ఐదేళ్ల విరామం తర్వాత భారత్‌కు నేరుగా విమాన సర్వీసులను నడుపుతున్న చైనా తొలి విమానయాన సంస్థగా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ నిలిచింది. ఎంయూ 563 విమానం, 248 మంది ప్రయాణికులతో షాంఘైలోని పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. భారత్‌కు చెందిన ఇండిగో సంస్థ సోమవారం నుంచి ఢిల్లీ-గువాంగ్‌ఝౌకు విమాన సర్వీసులను నడపనుంది. షాంఘై-ఢిల్లీ మార్గం అత్యంత కీలకమైనది. ఈ నూతన విమాన సర్వీసువల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక, సాంస్కృతిక సంబంధ రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.


