స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న హారర్-కామెడీ ది రాజా సాబ్ చిత్రం పై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందన్న దానిపై అభిమానుల మధ్య పెద్ద చర్చ జరుగుతోంది. దీనిపై చివరికి నిర్మాత ఎస్‌కేఎన్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఎస్‌కేఎన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫస్ట్ సింగిల్ నవంబర్ మూడో లేదా నాలుగో వారంలో విడుదల కానుంది. ఆ తర్వాత సినిమా ప్రమోషన్లు డిసెంబర్ చివరి వరకు కొనసాగుతాయి. ఈ క్రమంలో ది రాజా సాబ్ ను 2026 జనవరి 9న, సంక్రాంతి సీజన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి టీమ్ సన్నాహాలు చేస్తోంది.
మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి, ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్‌పై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. నిర్మాత ఎస్‌కేఎన్ ఇచ్చిన తాజా అప్‌డేట్‌తో అభిమానులు ఊరట చెందారు. మెలోడి సాంగ్ రూపంలో రాబోయే ఈ ఫస్ట్ సింగిల్, ప్రభాస్ మ్యూజిక్ జర్నీకి కొత్త ఛాప్టర్‌గా నిలిచే అవకాశముంది.


