ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీద దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో ప్రచారం కోసం పిటిషన్లు దాఖలు చేస్తున్నారని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో మరో మారు కేఏ పాల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైనట్లైంది. ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను పీపీపీ మోడ్‌లో పూర్తి చేసి నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కేఏ పాల్, సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిపై కేఏ పాల్‌పై అత్యున్నత ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని కేఏ పాల్‌కు సూచించింది.


