కెనడియన్-హంగరియన్-బ్రిటిష్ రచయిత డేవిడ్ సలై ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ గెలుపొందారు. తన రచించిన ఫ్లెష్ నవలకుగానూ ఈ అవార్డు దక్కింది. సుదీర్ఘంగా సాగే ఒక సాధారణ వ్యక్తి కథ ఇది. ఈ నవల ప్రత్యేక ఏంటంటే రచయిత కొన్ని లైన్ల మధ్య ఖాళీ ఉంచాడు. పాఠకుడు ఆ వ్యక్తికి లోతైన భావాలు, సంఘర్షణలు ఊహించాల్సి ఉంటుంది. అయితే ఆ ఖాళీలు వ్యక్తి జీవితంలో ఏం జరిగి ఉంటుందో తెలిసేలా సులభంగానే రచయిత రూపకల్పన చేశారు. 51 ఏండ్ల డేవిడ్ సలై తుదిపోరులో ఐదుగురు పోటీదారులను అధిగమించి బుకర్ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. దీంతో అవార్డు గెలుచుకున్న డేవిడ్‌కు రూ.50,000 పౌండ్లు దక్కనున్నాయి. మొత్తం 153 నవలలు ఈ ప్రైజ్ కోసం పోటీ పడగా ఐరిష్ రచయిత రాడీ డోయల్, సారా జెస్సీకా పార్కర్‌లతో కూడిన న్యాయనిర్ణేతలు డైవిడ్ రాసిన ఫ్లెష్ ను ఎంపిక చేశారు. ఇందుకోసం జడ్జిలు ఐదుగంటలు సమావేశమయ్యారు. అనంతరం ఏకగ్రీవంగా దీన్ని ఎంపిక చేశారు.


