బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతల కారణంగా భారత్ కు వచ్చి ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లే విషయంలో అక్కడి ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టింది. అందరి భాగస్వామ్యం ఉండేలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలనేది అందులో ప్రధానమైన షరతు. అదేవిధంగా బంగ్లాలో అవామీ లీగ్ పార్టీ పై నిషేధం ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్వహించినప్పుడే తాను తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తానని స్పష్టం చేశారు. అక్కడి ప్రజలు కూడా అటువంటి పరిస్థితులనే కోరుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం బంగ్లాలో అధికారంలో ఉన్న యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీవ్రవాద శక్తులకు అధికారం ఇస్తూ, భారత్‌తో ఆ దేశ సంబంధాలను ప్రమాదంలో పడేస్తోందని ఆమె ఆరోపించారు.


