ఎన్ని అక్రమాలు చేసినా జూబ్లీహిల్స్‌లో ధర్మమే గెలుస్తుందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. బైపోల్స్‌లో ఎంఐఎం కూడా అక్రమాలకు పాల్పడి కాంగ్రెస్‌కు సహకరించిందని ఆరోపించారు. పోలీసులు బోగస్ ఓటింగ్‌కు సహకరించటం ప్రత్యక్షంగా చూశామన్నారు. కాగ్ రిపోర్ట్ సీఎం రేవంత్ రెడ్డి బట్టలు విప్పేసిందన్నారు. అప్పులు భారీగా తెచ్చిన రేవంత్, ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ వ్యాఖ్యలు చేశారు. అనుభవం లేని ముఖ్యమంత్రి ఉంటే, ఇంతకంటే ఏం జరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్‌ను సర్వనాశనం చేశారని మండిపడ్డారు.
హైడ్రా పేరుతో ఆర్ఆర్ టాక్స్‌తో దోపిడీ జరుగుతుందని ఆరోపణలు గుప్పించారు. రెండేళ్ళల్లో రూ.3.48వేల కోట్ల అప్పులు తెచ్చారన్నారు. పార్టీ ఫిరాయింపుల విచారణ సందర్భంగా సందర్శకులు, మీడియాపై నిషేధం సరికాదని అన్నారు. ఇది అసెంబ్లీ స్పీకర్, ముఖ్యమంత్రి రేవంత్ సొంత వ్యవహారం కాదని చెప్పుకొచ్చారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఉంది అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు , మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలకు ప్రవేశాన్ని నిషేధించడం ఏంటని ప్రశ్నించారు.


