పార్టీ ఫిరాయింపుల విషయంలో కలకత్తా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్.. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ముకుల్ రాయ్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బీజేపీ నేతలు కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ నేతలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. ముకుల్ రాయ్‌ను ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేస్తూ కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


