My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - NRI

హెచ్‌-1బీ వీసాలపై.. యూఎస్‌ మంత్రి కీలక వ్యాఖ్యలు

విదేశీ ఉద్యోగులు ముఖ్యంగా భారతీయ వలసదారులను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌పై అనూహ్య స్పందన వ్యక్తమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ఈ వీసా ప్రోగ్రామ్‌ని గట్టిగా సమర్థించారు. ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగిన స్వదేశీ ఉద్యోగులు లేని కారణంగా విదేశాల నుంచి నైపుణ్యం తెచ్చుకోవడం దేశానికి అవసరమంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ట్రంప్‌ వ్యాఖ్యల నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాలపై అమెరికా ఆర్థికశాఖ […]

విదేశీ ఉద్యోగులు ముఖ్యంగా భారతీయ వలసదారులను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌పై అనూహ్య స్పందన వ్యక్తమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ఈ వీసా ప్రోగ్రామ్‌ని గట్టిగా సమర్థించారు. ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగిన స్వదేశీ ఉద్యోగులు లేని కారణంగా విదేశాల నుంచి నైపుణ్యం తెచ్చుకోవడం దేశానికి అవసరమంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ట్రంప్‌ వ్యాఖ్యల నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాలపై అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇప్పించేందుకే హెచ్‌1బీ ఉద్యోగాలని తెలిపారు.

స్కాట్‌ బెసెంట్‌ మాట్లాడుతూ  ట్రంప్ కొత్త H-1B వీసా విధానం నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి తీసుకురావడానికి రూపొందించబడిందని వెల్లడించారు. అంతేకాని, విదేశీయులను భర్తీ చేసేందుకు కాదని స్పష్టం చేశారు. అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోండి. ఆ తర్వాత అమెరికన్లే పూర్తిగా బాధ్యతలు తీసుకుంటారు అనేదే వీసా విషయంలో ట్రంప్ కొత్త విధానం అని వెల్లడించారు. విదేశీ కార్మికులపై దీర్ఘకాలంగా ఆధారపడకుండా ఉండేందుకే ఈ నిర్ణయమని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.