పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశం రెండు దేశాలతో యుద్ధానికి సిద్ధంగా ఉందంటూ ప్రకటించారు. తూర్పు సరిహద్దులోని భారత్ , పశ్చిమ సరిహద్దులో తాలిబన్లతో రెండు వైపులా యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించారు. ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మేము రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము. తూర్పు (భారతదేశం), పశ్చిమ సరిహద్దు (అఫ్ఘానిస్థాన్) దేశాలను రెండింటినీ ఎదుర్కోవడానికి మేము పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. ఈ యుద్ధంలో అల్లా మాకు అన్ని విధాలుగా సాయం చేస్తాడు అంటూ వ్యాఖ్యానించారు.


