My Telugu NRI

Mobile Scrollable Menu
- Business - Latest News

వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే ఇకపై

ఫాస్టాగ్‌   లేకుండా జాతీయ రహదారుల పై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఫాస్టాగ్‌లేనివారికి టోల్‌ ప్లాజాల వద్ద విధిస్తున్న రెట్టింపు ఛార్జీ ల నిబంధనను సడలించింది. ఇకపై కేవలం 25 శాతం అదనపు రుసుము చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన నేటి నుంచి అమల్లోకి వచ్చింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు ఫాస్టాగ్‌ తప్పనిసరిగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఫాస్టాగ్‌ లేనివారు టోల్‌ రుసుముకు రెండింతలు చెస్తున్నారు. నగదు రూపంలో అయినా […]

ఫాస్టాగ్‌   లేకుండా జాతీయ రహదారుల పై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఫాస్టాగ్‌లేనివారికి టోల్‌ ప్లాజాల వద్ద విధిస్తున్న రెట్టింపు ఛార్జీ ల నిబంధనను సడలించింది. ఇకపై కేవలం 25 శాతం అదనపు రుసుము చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన నేటి నుంచి అమల్లోకి వచ్చింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు ఫాస్టాగ్‌ తప్పనిసరిగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఫాస్టాగ్‌ లేనివారు టోల్‌ రుసుముకు రెండింతలు చెస్తున్నారు. నగదు రూపంలో అయినా యూపీఐ ద్వారా చెల్లించినా ఇదే నిబంధన వర్తిస్తోంది. నేషనల్‌ హైవేలపై టోల్‌ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటే, రూ.200 వరకూ వసూలు చేసే వారు. అయితే, ఆ నిబంధనలను కేంద్రం తాజాగా సడలించింది. తాజా నిబంధనల ప్రకారం ఫాస్టాగ్‌లేని వాహనదారులు యూపీఐ  ద్వారా టోల్‌ ఛార్జీ చెల్లిస్తే 25 శాతం అదనంగా చెల్లిస్తే సరిపోతుంది. రూ.100కు 25 శాతం అదనంగా అంటే రూ.125 చెల్లించి వెళ్లొచ్చు. నగదు రూపంలో చెల్లిస్తే మాత్రం రెట్టింపు ఛార్జీ కట్టాల్సిందే. డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.