కామన్ హెల్త్ మహిళా సదస్సులో ఐదు రోజుల పాటు పాల్గొన్నానని రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సదస్సులో తనకు రెండు అరుదైన గౌరవాలు లభించాయని ఉద్ఘాటించారు. రాజమండ్రిలో పురందేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అణుశక్తి కి సంబంధించి అణుబాంబులు తయారు చేయాలని భారతదేశం ప్రకటించిందని గుర్తుచేశారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించటం ద్వారా ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారని చెప్పుకొచ్చారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని వివరించారు. పొగాకు రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో తాను మాట్లాడానని తెలిపారు.


