కన్నడలో కాంతార తరువాత రూటెడ్ కథతో మరో సంస్కృతి ఆధారిత సినిమా కొరగజ్జ రాబోతోంది. త్రివిక్రమ్ సాపల్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల కర్ణాటక మంగళూరులో ఆడియోను ఆవిష్కరించారు. గోపీసుందర్ స్వరకర్త. కాంతర తరహాలో గ్రామీణ సంస్కృతి, ఆచారాలు కలబోసిన దైవగాథ ఇదని, ప్రేక్షకుల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించేలా ఉంటుందని దర్శకుడు తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాత త్రివిక్రమ్ సాఫల్య పేర్కొన్నారు. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని గోపీసుందర్ తెలిపారు. ఈ చిత్రానికి కథా పరిశోధన, స్క్రీన్ప్లే, సాహిత్యం, సంభాషణ: సుధీర్ అత్తవర్.


