బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్థానిక ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్‌లో రహస్య ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఐసీటీ తీర్పు నేపథ్యంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఆమెను భారత్ నుంచి స్వదేశానికి రప్పించేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఇంటర్‌పోల్ సాయం కోరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. షేక్ హసీనా పరోక్షంలో విచారణ జరిపిన ట్రిబ్యునల్ హసీనా ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన సదుజ్జమాన్ ఖాన్ కమల్‌కు కూడా ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం వారు భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వారి అప్పగింతపై యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇంటర్‌పోల్ సాయం కోరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.


