My Telugu NRI

Mobile Scrollable Menu
- Andhra - Latest News

సీబీఐ కోర్టులో విచారణకు హాజరైన వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ రోజు సీబీఐ స్పెషల్ కోర్టుకు విచారణ కోసం హాజరయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన నేరుగా అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసులో 2013 సెప్టెంబరు నుంచి జగన్ మధ్యంతర బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ చేసిన అభ్యర్థనను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆరేండ్లుగా జగన్ కోర్టుకు […]

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ రోజు సీబీఐ స్పెషల్ కోర్టుకు విచారణ కోసం హాజరయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన నేరుగా అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసులో 2013 సెప్టెంబరు నుంచి జగన్ మధ్యంతర బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ చేసిన అభ్యర్థనను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆరేండ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ స్పష్టం చేసింది. ఈ పరిణామం క్రమంలో రేపటిలోపు వ్యక్తిగతంగా హాజరవ్వాలని జగన్‌ను కోర్టు ఆదేశించడంతో ఆయన ఇవాళ విచారణకు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.