My Telugu NRI

Mobile Scrollable Menu
- Business - Latest News

అమెజాన్‌లో మరోసారి..  రికార్డు స్థాయిలో

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌  గత నెలలో భారీగా లేఆఫ్స్‌  ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 14,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లేఆఫ్స్‌ ప్రభావం సంస్థలోని దాదాపు అన్ని విభాగాలపై పడింది. క్లౌడ్‌ సర్వీసెస్‌, డివైజెస్‌, రిటెయిల్‌, అడ్వర్టైజింగ్‌, గ్రాసరీస్‌ విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితమయ్యారు. అయితే, ఈ లేఆఫ్స్‌కు సంబంధించిన కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ కోతల్లో అత్యధికంగా నష్టపోయింది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లేనని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాలోని న్యూయార్క్, కాలిఫోర్నియా, […]

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌  గత నెలలో భారీగా లేఆఫ్స్‌  ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 14,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లేఆఫ్స్‌ ప్రభావం సంస్థలోని దాదాపు అన్ని విభాగాలపై పడింది. క్లౌడ్‌ సర్వీసెస్‌, డివైజెస్‌, రిటెయిల్‌, అడ్వర్టైజింగ్‌, గ్రాసరీస్‌ విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితమయ్యారు. అయితే, ఈ లేఆఫ్స్‌కు సంబంధించిన కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ కోతల్లో అత్యధికంగా నష్టపోయింది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లేనని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

అమెరికాలోని న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్ రాష్ట్రాల్లోని వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్  ఫైలింగ్స్ ప్రకారం  ఆ రాష్ట్రాల్లో తొలగించిన 4,700 ఉద్యోగాల్లో దాదాపు 40 శాతం (1,800) ఇంజనీరింగ్ రోల్స్‌ కు చెందినవే. ముఖ్యంగా మిడ్-లెవల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్లు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఉద్యోగుల తొలగింపుకు ఏఐ కారణం కాదని సంస్థ తెలిపింది. మరోవైపు వచ్చే ఏడాది జనవరిలో మరో రౌండ్‌ లేఆఫ్స్‌ ఉండే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో లేఆఫ్స్‌ గుబులు మొదలైంది. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.