My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

అమ్మ సెంటిమెంట్‌తో రూపొందిన సినిమా ఇది

రవి, శ్రేయ తివారి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం విచిత్ర. సిస్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై సైఫుద్దీన్‌ మాలిక్‌ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్‌ పనులు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్బంగా దర్శక, నిర్మాత సైఫుద్దీన్‌ మాలిక్‌ మాట్లాడుతూ ఒక ఆత్మీయమైన అమ్మ సెంటిమెంట్‌ నేపథ్యంతో రూపొందిన సినిమా. ప్రతి కుటుంబం తల్లి ప్రేమ, త్యాగం, బంధం గురించి ఆలోచించేలా చేసే హృదయాన్ని తాకే కథ ఇది. ఈ చిత్రాన్ని […]

రవి, శ్రేయ తివారి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం విచిత్ర. సిస్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై సైఫుద్దీన్‌ మాలిక్‌ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్‌ పనులు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్బంగా దర్శక, నిర్మాత సైఫుద్దీన్‌ మాలిక్‌ మాట్లాడుతూ ఒక ఆత్మీయమైన అమ్మ సెంటిమెంట్‌ నేపథ్యంతో రూపొందిన సినిమా. ప్రతి కుటుంబం తల్లి ప్రేమ, త్యాగం, బంధం గురించి ఆలోచించేలా చేసే హృదయాన్ని తాకే కథ ఇది. ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చూసే ఫ్యామిలీ డ్రామాగా నిలుస్తుందనే నమ్మకంతో మా టీమ్‌ పనిచేసింది. అమ్మ ప్రేమను, భావోద్వేగాన్ని, కుటుంబ విలువలను కొత్త దృక్కోణంలో ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాం. ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్ర వేస్తుందని ఆశిస్తున్నాం అని తెలిపారు. జ్యోతి అపూర్వ, రవి, శ్రేయ తివారి, బేబీ యసిక రవి ప్రకాష్‌, సూర్య, ఛత్రపతికి శేఖర్‌, జబర్దస్త్‌ ఉద్ధండులు అప్పారావు, త్రినాథ్‌, సత్తిపండు, బాబీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌-కడిమిశెట్టి లక్ష్మీనారాయణ, సంగీతం- నిజాని, నిర్మాత, దర్శకత్వం – సైఫుద్దీన్‌ మాలిక్‌.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.