హీరో రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్టైనర్ ఆంధ్ర కింగ్ తాలూకాతో అలరించబోతు న్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల27న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్‌లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో హీరో రామ్ మైండ్ బ్లోయింగ్ ఎనర్జిటిక్ సింగింగ్ పెర్ఫార్మెన్స్ అందరినీ మెస్మరైజ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా కెరీర్లో గర్వపడే సినిమా ఇది. రవి, నవీన్ చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్. వివేక్, మార్విన్ తెలుగు సినిమాకి ఒక కొత్త సౌండ్ తీసుకొచ్చారు. ఈ ఆల్బమ్ గుండెల్లో నిలిచిపోతుంది. ఇది వారి ఆరంభం మాత్రమే. తెలుగు ఇండస్ట్రీకి చాలా రోజుల తర్వాత గ్లామర్‌తో పాటు మంచి పర్ఫార్మ్ చేసే హీరోయిన్ భాగ్యశ్రీ వచ్చింది. ఏదైనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు దర్శకుడు మహేష్ నా జీవితంలోకి వచ్చాడు. తనతో వర్క్ చేయడం మోస్ట్ బ్యూటీఫుల్ ఎక్స్పీరియన్స్. ఉపేంద్రతో కలిసి పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. మై డియర్ ఫ్యాన్స్, జీవితంలో పైకి రావాలంటే ప్యాషన్, పర్పస్ ఉండాలి. నా పర్పస్ మీరే’ అని తెలిపారు.
హీరోయిన్ భాగ్యశ్రీ మాట్లాడుతూ నా చిన్ని గుండెలో చాలా ఆశలతో ఇక్కడికి వచ్చాను. మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు. రామ్ అభిమానుల్ని ఎంతగానో ప్రేమించే హీరో. మీ అందరి ప్రేమకు ఆయన అర్హులు అని చెప్పారు. ఏ, ఉపేంద్ర, రక్తకన్నీరు ఈ సినిమాలన్నీ మీకు గుర్తు ఉండటం చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన వ్యక్తిగా ఒక మాట చెప్తున్నాను. ఈ సినిమా చూసి, మీరు అందరూ కాలర్ ఎగరేసు కుంటూ బయటికి వస్తారు. మహేష్ సినిమాని అద్భుతంగా చేశారు అని ఉపేంద్ర అన్నారు.


