ఓర్లాండోకు చెందిన బిలియనీర్, ఫార్మా రంగంలో అతిపెద్ద దిగ్గజంగా ఎదిగిన రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన , సూపర్ ఆర్డర్ సహ వ్యవస్థాపకుడు వంశీ గదిరాజు వివాహ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అంబానీ కుటుంబ వివాహాల తర్వాత భారతదేశంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్‌గా ఈ వేడుకలు నిలుస్తున్నాయి. ఉదయ్‌పూర్ లో నవంబర్ 21 నుంచి 23 వరకు జరిగిన ఈ ఉత్సవాల్లో బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, మాధురీ దీక్షిత్, నోరా ఫతేహీ, దియా మీర్జా, రణ్వీర్ సింగ్, హాలీవుడ్ స్టార్ జెన్నీఫర్ వంటి ప్రముఖులు ఆడిపాడారు. ఈ రాయల్ వెడ్డింగ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ వెడ్డింగ్‌కి దాదాపు రూ.100 కోట్లు ఖర్చైనట్లు సమాచారం.


