My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

విక్రమ్‌-1 రాకెట్‌ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

హైదరాబాద్‌ రావిల్యాలలోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి ప్రైవేటు కమర్షియల్ రాకెట్‌ విక్రమ్‌-1ను ఆవిష్కరించారు. స్కైరూట్‌ ఇన్ఫినిటీ క్యాంపస్‌ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ సంస్థ కావడం విశేషం. ఈ సందర్భంగా స్కైరూట్‌ బృందానికి ప్రధాని అభినందనలు చెప్పారు. అనంతరంమోదీ  మాట్లాడుతూ భారతీయ అంతరిక్షం లో ఇది మైలురాయిగా పేర్కొన్నారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్‌ గొప్ప ప్రతీక అని, భారత అంతరిక్ష రంగం భవిష్యత్తులో మరిన్ని […]

హైదరాబాద్‌ రావిల్యాలలోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి ప్రైవేటు కమర్షియల్ రాకెట్‌ విక్రమ్‌-1ను ఆవిష్కరించారు. స్కైరూట్‌ ఇన్ఫినిటీ క్యాంపస్‌ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ సంస్థ కావడం విశేషం. ఈ సందర్భంగా స్కైరూట్‌ బృందానికి ప్రధాని అభినందనలు చెప్పారు. అనంతరంమోదీ  మాట్లాడుతూ భారతీయ అంతరిక్షం లో ఇది మైలురాయిగా పేర్కొన్నారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్‌ గొప్ప ప్రతీక అని, భారత అంతరిక్ష రంగం భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుందని.. సైకిల్‌పై రాకెట్‌ మోసుకెళ్లే స్థితి నుంచి మన ప్రస్థానం ప్రారంభమైందన్నారు. వ్యవసాయం, వాతావరణ అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలని పిలుపునిచ్చారు. స్పేస్‌ సెక్టార్‌లో కో ఆపరేటివ్‌, ఎకో సిస్టమ్‌ను తీసుకువచ్చామని, జన్‌జీ అనుకున్నది సాధించేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు.

అంతరిక్ష రంగంలో కేంద్రం ఇస్తున్న మద్దతు వల్లే స్టార్టప్‌లు వస్తున్నాయని, ప్రైవేటు రంగంలోనూ అంతరిక్ష సంస్థలు పుట్టుకొస్తున్నాయన్నారు. జన్‌జీ ఇంజినీర్లు, డిజైనర్లు, కోడర్స్‌, సైంటిస్టులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గ్లోబల్ శాటిలైట్ వ్యవస్థలో భారత్ లీడర్‌గా మారనుందన్నారు. స్కైరూట్‌ లాంచింగ్‌తో యువతలో నమ్మకం పెరుగుతుందన్న ఆయన, భారతీయ స్పేస్ సెక్టార్‌లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. ప్రపంచంలో చిన్న శాటిలైట్లకు డిమాండ్ పెరిగిందని, రాబోయే కాలంలో శాటిలైట్ ఎకానమీ భారీగా పెరుగుతుందన్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో మాత్రమే అంతరిక్ష పరిజ్ఞానం ఉందని,  భారత శాటిలైట్లు తక్కువ ఖర్చుతో నమ్మదగినవని చెప్పారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.