మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌కు ముహూర్తం ఖారారైంది. మెగా వేలం రోజునే టోర్నీ ఆరంభ తేదీని బీసీసీఐ వెల్లడించింది. ఊహించినట్టుగానే జనవరిలోనే నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. అయితే.. ముందుగా వినిపించిన జనవరి 7న కాకుండా జనవరి 9 నుంచి సీజన్ మొదలవ్వనుందని డబ్ల్యూపీఎల్ ఛైర్మన్ జయేశ్ జార్జ్ పేర్కొన్నారు. పురుషుల టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ షెడ్యూల్‌ను ముందుకు జరిపిన విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ మ్యాచ్‌లకు ఈసారి రెండు వేదికలనే ఖరారు చేశారు. నవీ ముంబై, వడోదర లోనే అన్ని మ్యాచ్‌లు నిర్వహిస్తామని డబ్ల్యూపీఎల్ ఛైర్మన్ జయేశ్ జార్జ్ తెలిపారు. జనవరి 9న నవీ ముంబైలో టోర్నీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 5 న వడోదరలో ఫైనల్ బీసీసీఐ తెలిపింది. త్వరలోనే పూర్తి షెడ్యూల్ విడుదల చేయనున్నారు.


