అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైట్‌హౌస్ ఎదుట కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దుండగులు జరిపిన కాల్పుల్లో వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డు సిబ్బంది మృతి చెందారు. మొత్తం ముగ్గురు జవాన్లపై కాల్పులు జరిగాయి. ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మరో జవాను స్వల్పంగా గాయపడ్డాడు. ఈ సంఘటన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అఫ్గాన్‌తో సహా మరో 18 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌ను సమీక్షించనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో వెల్లడించారు. ప్రతి విదేశీయుడి గ్రీన్ కార్డును పూర్తిస్థాయిలో పునఃపరిశీలన చేయాలి అని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించినట్లు తెలిపారు.


