కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాలకే పరిమితం కాకుండా జరుగుతున్న ప్రతీ అభివృద్ధి ప్రజల కళ్ళకు కట్టేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధానిలో బ్యాంకులు, భీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్పా ల్గొని ప్రసంగించారు. అమరావతిలో ఏర్పాటు చేసే బ్యాంక్ స్ట్రీట్, ఆర్థిక కార్యకలాపాలను మరింత పెంచుతుందని తెలిపారు. ఆర్థిక కేంద్రంతో పాటు విద్య, పరిశోధన కేంద్రంగా అమరావతి ఎదుగుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధికి వేసే ప్రతీ అడుగులో కేంద్ర తోడ్పాటు ఉంటోందన్నారు. బలమైన నాయకత్వం, అనుభవంతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రం కోసం నిలబడ్డ అమరావతి రైతుల కోసం తాము నిలబడతామని పేర్కొన్నారు.


