My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు ముందే … కీలక నిర్ణయం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు సిద్ధమవుతున్న వేళ మాస్కో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో కుదుర్చుకున్న సైనిక సహకార ఒప్పందాన్ని రష్యా పార్లమెంట్‌లో ఆమోదించేందుకు రంగం సిద్ధమైంది. పుతిన్ పర్యటనకు కొన్ని రోజుల ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. మాస్కోలో జరిగిన కార్యక్రమంలో రష్యా రక్షణ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్, […]

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు సిద్ధమవుతున్న వేళ మాస్కో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో కుదుర్చుకున్న సైనిక సహకార ఒప్పందాన్ని రష్యా పార్లమెంట్‌లో ఆమోదించేందుకు రంగం సిద్ధమైంది. పుతిన్ పర్యటనకు కొన్ని రోజుల ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. మాస్కోలో జరిగిన కార్యక్రమంలో రష్యా రక్షణ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్, ఆ దేశంలో భారత రాయబారి వినయ్ కుమార్‌లు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఇప్పుడు దీనికి చట్టబద్ధత కల్పిస్తూ రష్యా పార్లమెంట్ ఆమోదముద్ర వేయనుంది. దీంతో ఇరు దేశాల మధ్య సైనిక బంధం మరింత బలోపేతం కానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.